NTV Telugu Site icon

Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలి.. బాలిక తల్లికి డబ్బులు ఆఫర్ చేసిన సమాజ్‌వాదీ నేతలు..

Up

Up

Ayodhya gangrape: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అంశం సంచలనంగా మారింది. అయోధ్యలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయోధ్య జిల్లాలోని భదర్సా నగర్‌లో ఖాన్ బేకరీ యజమాని, స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత అయిన మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ ఇద్దరు అందులో పనిచేస్తున్న 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గర్భం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి సర్కార్ నిందితుల బేకరీని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ కేసులో బాధితురాలిని సీఎం యోగి నేరుగా కలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also: Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్‌డోజర్‌!

ఇదిలా ఉంటే, అత్యాచార విషయాన్ని దాచి ఉంచేందుకు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పలువురు నేతలు తమకు డబ్బు ఆశ చూపించినట్లుగా బాధితురాలి తల్లి చెప్పింది. భదర్సనగర్ పంచాయతీ చైర్మన్‌గా ఉన్న ఎస్పీ నేత మహ్మద్ రషీద్ తనకు డబ్బు ఆఫర్ చేసి, కేసులో రాజీ కుదుర్చుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పోలీసు అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. తమకు ఆర్థిక సాయం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.

రెండు నెలల క్రితం బాలికపై మోయిద్ ఖాన్, రాజుఖాన్ లు అత్యాచారానికి పాల్పడ్డారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. నిందితుడు మొయిద్ ఖాన్, ఇటీవల అయోధ్య రామాయలం ఉన్న ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ టీంలో భాగమని బీజేపీతో పాటు సీఎం యోగి ఆరోపించారు. అయితే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ కేసులో నిందితులకు దూరంగా ఉన్నారు. మరోవైపు నిందితులకు డీఎన్ఏ టెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేయడంపై అధికార బీజేపీతో పాటు మాయావతి బీఎస్పీ పార్టీ ఫైర్ అవుతోంది.