NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తిపై ప్రభుత్వం నియంత్రణ!

Saif

Saif

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరోసారి షాక్ తగిలేలా కనిపిస్తుంది. అతడి కుటుంబానికి సంబంధించిన దాదాపు 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, సైఫ్ అలీ ఖాన్ పటౌడి రాజవంశీయుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. పటౌడి రాజ వంశీయుల ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947 భారతదేశం విభజన జరిగిన సమయంలో తన ఆస్తులు ఇక్కడే వదిలి పెట్టి పాకిస్తాన్ కి వెళ్ళగా.. అప్పుడు ఎవరైతే దేశాన్ని వదిలి వెళ్లారో.. ఆ ఆస్తి ఎనిమి చట్టం కిందికి వస్తుందని అప్పటి భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. అప్పుడు అభిదా సుల్తాన్ వదిలి వెళ్లిన రూ. 15 వేల కోట్ల ఆస్తి ఎనిమి చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లుతుంది. కానీ, సైఫ్ అలీ ఖాన్ మాత్రం దానికి అడ్డుకట్ట వేసి అది మా వారసత్వపు ఆస్తి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి ఎలా దక్కుతుంది దానిపై సర్వహక్కులు నాకు ఉన్నాయని న్యాయస్థానంలో పేర్కొన్నారు.

Read Also: Supreme Court: సంజయ్‌ రాయ్‌కు జీవితఖైదు.. నేడు విచారించనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్

అయితే, న్యాయస్థానం అప్పట్లో స్టే ఇచ్చినప్పటికీ దీన్ని 2024 డిసెంబర్ 13వ తేదీన భూపాల్ హైకోర్టు ఈ స్టే ఎత్తేసింది. ఇక, స్టే ఎత్తివేసాక 30 రోజుల పాటు మళ్ళీ అప్పిల్ చేసుకోవాలి.. కానీ, 15 వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. దాంతో ఆ పదిహేను వేల కోట్ల ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని భోపాల్ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో సైఫ్ అలీఖాన్ ఏమైనా పోరాటం చేస్తారా లేక ఆ ఆస్తులు నాకు ఎందుకులే అని వదిలేస్తారా అనేది వేచి చూడాలి.