NTV Telugu Site icon

S Jaishankar: నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్.. ట్రంప్‌తో భేటీ అయ్యే ఛాన్స్..?

Jaishankar

Jaishankar

S Jaishankar: నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, అమెరికా పర్యటనలో జైశంకర్ ప్రధానంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. అయితే, యూఎస్ లో జరిగే భారత కాన్సుల్స్ జనరల్ కాన్ఫరెన్స్‌కు ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో భాగంగా అమెరికా అధికారులతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

Read Also: Off The Record: బన్నీకి సపోర్ట్‌గా కాషాయ పార్టీ.. ఏదో మతలబు ఉందని అనుమానం..!

ఇక, ఈ సమావేశంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ సహా ఇతర అధికారులతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కలవనున్నారు. అలాగే, యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు అతని బృందంలోని పలువురుని కలిసే అవకాశం ఉంది. అయితే, జనవరి 20వ తేదీన ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Show comments