Site icon NTV Telugu

Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..

Putin

Putin

Hathras stampede: 121 మందిని బలితీసుకున్న హత్రాస్ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం హత్రాస్‌లో ఓ సత్సంగ్ కార్యక్రమంలో జనాలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.

Read Also: Mohammad Rizwan: ఘోరపరాజయాల తర్వాత, పాక్ క్రికెట్‌లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..

ఇదిలా ఉంటే, ఈ విషాదకరమైన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించండి’’ అని పుతిన్ సందేశాన్ని రాయబార కార్యాలయం జోడించింది. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.

Exit mobile version