Site icon NTV Telugu

Ukraine War: ఇండియన్ ఫార్మా గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి..

Ukraine

Ukraine

Ukraine War: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఫార్మాసూటికల్ కంపెనీ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ విసయాన్ని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా “ఉద్దేశపూర్వకంగా” ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ‘‘ ఈరోజు ఉక్రెయిన్ భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ గిడ్డంగిని రష్యా క్షిపణి దాడి చేసింది. భారతదేశంతో తమది ప్రత్యేక స్నేహం అని చెప్పుకుంటూనే, మాస్కో ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంది. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించబడిన మందుల్ని నాశనం చేసింది’’ అని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది.

Read Also: Annamayya District: 78 మందితో ఇంటర్‌ కాలేజీ ప్రారంభం.. ఫస్ట్ ఇయర్‌లో ఒక్కరే పాస్!

భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థల్లో ఒకటి. ఉక్రెయిన్‌కి ముందు బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్, రష్యన్ దాడులు కైవ్‌లోని ఒక ప్రధాన ఫార్మా గిడ్డంగిని ధ్వంసమైందని చెప్పారు. ఉక్రెయిన్ తమ ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు దాడులు చేసిందని, యూఎస్ మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక నిషేధాన్ని ఉల్లంఘించిదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

Exit mobile version