Russia: భారత్ మాకు సహాయం చేయాలి.. రష్యా అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్( FATF) నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. అయితే FATF నిబంధనలతో రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచదేశాలను కోరుతున్నారు. వచ్చే నెలలో దీనికి సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి రష్యా, భారతదేశ సాయం కోరుతోంది.
ఆప్తమిత్ర దేశం అయిన రష్యాతో భారత్ కు అనేక వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలో అనేక ప్రాజెక్టులను రష్యా చేపడుతోంది. ఈ నేపథ్యంలో FATF కింద రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తే ఆ ప్రభావం భారత్ పై పడుతుంది. రష్యాను బ్లాక్ లిస్టులో చేర్చాలంటూ ఉక్రెయిన్ పాశ్చాత్యదేశాలపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. భారత్ తన పలుకుబడితో ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలని రష్యా అభ్యర్థిస్తోంది. సహజంగా ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేలా ఆర్థిక నిధులను సమకూర్చే దేశాలపై FATF నిబంధనలు విధిస్తుంది. అయితే రష్యా నుంచి ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదానికి నిధులు కానీ ఇవ్వడం ఎప్పుడు జరగలేదు. ఈ నేపథ్యంలో FATF ఆంక్షల కిందకు రష్యా ఎలా వస్తుందని ఆ దేశం ప్రశ్నిస్తోంది.
Also Read
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
Read Also: New Parliament Building: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిటిషన్
FATF బ్లాక్ లిస్టులో ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ఒక వేళ ఆంక్షలు విధిస్తే రష్యా కూడా ఈ జాబితాలో చేరుతుంది. బ్లాక్ లిస్టులో ఉంటే ఆ దేశాలతో వాణిజ్యం, వ్యాపారం చేయడానికి వీలు లేదు. ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదు. ఇది రష్యాకే కాదు భారత్ కు కూడా ప్రమాదమే. భారత్, రష్యాల మధ్య పలు ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. గ్లోబల్ సౌత్ గా పిలువబడే పలు దేశాలు రష్యా-ఉక్రెయిన్ పరిణామాల్లో తటస్థంగా ఉన్నాయి.
రష్యాకు వ్యతిరేకంగా FATF కొత్త చర్యలను అవలంబిస్తే, రక్షణ, ఇంధనం మరియు రవాణాలో సహకారం కోసం అనూహ్యమైన మరియు ప్రతికూల పరిణామాలు ఉంటాయని ఈ నెల ప్రారంభంలో ఒక రష్యన్ స్టేట్ ఏజెన్సీ భారతదేశంలోని తమ సహచరులను హెచ్చరించింది. ఈ హెచ్చరికలకు భారత్ స్పందించో లేదో అనే విషయాన్ని రష్యా, భారత ప్రభుత్వాలు ధ్రువీకరించలేదు.
భారత్ లో రష్యా చేపడుతున్న ప్రాజెక్టులు..
*రష్యా చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ మరియు నయారా ఎనర్జీ లిమిటెడ్ మధ్య సహకారం
*ఎస్-400తో పాటు ఆయుధాలు, సైనిక ఎగుమతులు, దిగుమతులతో పాటు రక్షణ రంగ సాంకేతిక సహకారం.
*భారతదేశపు కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్
*ఉత్తర-దక్షిణ వాణిజ్య కారిడార్ అభివృద్ధికి అనుసంధానించబడిన కార్గో రవాణా సేవలపై రష్యన్ రైల్వేస్ యొక్క RZD లాజిస్టిక్స్ మరియు *కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం
తాజావార్తలు
-
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
-
Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
-
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!