NTV Telugu Site icon

RTI Activist Petition: అలీఘర్‌ దేవాలయ స్థలంలో మసీద్ నిర్మించారంటూ కోర్టులో పిటిషన్

Aligarhs Jama Masjid

Aligarhs Jama Masjid

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పురాతన దేవాలయాల స్థలంలో జామా మసీదు నిర్మించారంటూ ఆర్టీఐ కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగరంలోని జామా మసీదును బౌద్ధ, జైన, హిందూ దేవాలయాలు ఉన్నచోటే నిర్మించారని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త అలీఘర్‌లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలీఘర్ మునిసిపల్ కార్పొరేషన్‌తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలతో సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం.. సేకరించిన సమాచారం మేరకు ఆర్టీఐ కార్యకర్త పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra: మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. పెళ్లి భోజనంలో విషం కలిపిన వ్యక్తి..

ఆర్టీఐ కార్యకర్త పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న విచారణకు స్వీకరిస్తామని సివిల్ జడ్జి గజేంద్ర సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్, ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మక రికార్డుల ప్రకారం.. 18వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన జామా మసీదు మూలాల గురించి అనేక ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మసీదు ఎగువ కోట్ ప్రాంతంలో ఉందని.. పాత నగరంలో జనసాంద్రత, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం అని తెలిపారు. అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రత్యుత్తరాల్లో .. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో మసీదు నిర్మించినట్లుగా సూచిస్తుందని గౌతమ్ పేర్కొన్నారు. ఈ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న జామా మసీదు నిర్వహణ కమిటీని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. మసీదు స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ఇది కూడా చదవండి: Pushpa 2: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్

Show comments