Site icon NTV Telugu

Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగింది.. “రాజ్యాంగ పీఠిక” వివాదంపై రాహుల్ గాంధీ..

Rahulgandhi

Rahulgandhi

Rahul Gandhi: రాజ్యాంగ పీఠికలో ‘‘లౌకిక’’, ‘‘సోషలిస్ట్’’ పదాలను తీసేయాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ఈ పదాలను కొనసాగించడంపై చర్చకు పిలుపునిచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

Read Also: Matrimonial Fraud: రెండో పెళ్లి కోసం చూస్తే.. భరణంగా వచ్చిన రూ. 3.6 కోట్లు కొల్లగొట్టిన మోసగాడు..

‘‘ఆర్ఎస్ఎస్ ముసుగు మళ్లీ తొలగిపోయింది.’’ అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘రాజ్యాంగం వారికి కోపం తెప్పిస్తుంది ఎందుకంటే అది సమానత్వం, లౌకికవాదం మరియు న్యాయం గురించి మాట్లాడుతుంది. RSS-BJP రాజ్యాంగాన్ని కోరుకోవడం లేదు… వారికి మనుస్మృతి కావాలి.’’ అని ట్వీట్ చేశారు. ‘‘వారు అణగారిన మరియు పేదల హక్కులను తొలగించి వారిని మళ్ళీ బానిసలుగా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని వారి నుండి లాక్కోవడం వారి నిజమైన ఎజెండా. ఆర్ఎస్ఎస్ ఇలాంటి కలలు కనడం మానేయాలి. మేము వారిని ఎప్పటికీ విజయవంతం కానివ్వము’’ అని అన్నారు.

1976లో రాజ్యాంగ పీఠికలో చేర్చిన ‘‘సెక్యులర్’’, ‘‘సోషలిస్ట్’’ అనే పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ఆయన విమర్శలు చేశారు.

Exit mobile version