RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరిస్తూ, బాధిత సమాజాన్ని రక్షించడానికి తక్షణమే తగిన కృషి చేయాలన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించవచ్చని నేను ఆశిస్తున్నాను.. కానీ, ఆ చర్చలు ఫలించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మోడీ సర్కార్ గట్టిగా ప్రయత్నించాలన్నారు. మా దేవాలయాలను తగులబెడుతున్నారు.. హిందూ మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి ప్రతి హిందువు ఆగ్రహానికి లోనవాలని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ తెలిపారు.
Read Also: CM Chandrababu: హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి: సీఎం
అయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింస హిందూ సమాజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుంది.. ఈ సంఘటనలను ఖండించడం వల్ల పని జరగదని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించబోమన్నారు. ఇప్పుడు, మనం ఏమీ చేయకపోతే మన భావి తరాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌పై కూడా విరుచుకుపడ్డారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నడుపుతున్న దేశంలో శాంతి లేదు అని ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్‌లో ఇబ్బందులను సృష్టించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. అలాగే, ఇతర దేశాలలో హిందూ వ్యతిరేక హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత సునీల్ అంబేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.