RSS leader: రాజ్యాంగ పీఠిక నుంచి ‘‘సోషలిస్ట్’’, ‘‘సెక్యులర్’’ పదాలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గురువారం డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం అత్యవసర పరిస్థితిని విధించినందుకు కాంగ్రెస్‌ని విమర్శించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల పాటు పౌరుల స్వేచ్ఛ, హక్కులను హరించడంతో పాటు, అనేక మందిని జైళ్లకు పంపారు.
Read Also: Fake Gold Scam: తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని భారీ మోసం.. ఏకంగా రూ. 65 లక్షలు స్వాహా..!
ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో ప్రసంగించిన హోసబాలే.. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశికలో చేర్చిన సోషలిస్ట్, లౌకిక పదాలు అలాగే ఉండాలా వద్దా అని పరిశీలించాలని వాదించారు. అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగ కాపీలు పట్టుకుని తిరుగుతున్నారని కాంగ్రెస్ నేతల్ని విమర్శించారు. అత్యవసర పరిస్థితి రోజులను గుర్తుచేసుకుంటూ.. ఆ కాలంలో వేలాది మంది జైలులో పెట్టి హింసించారని, న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ కూడా హరించబడిందని ఆయన అన్నారు.
