Site icon NTV Telugu

Mohan Bhagwat: “మత ఆధారిత” జనాభా అసమతుల్యతను విస్మరించొద్దు.

Mohan Bagwat

Mohan Bagwat

RSS Chief Mohan Bhagwat comments on Religion-Based Population Imbalance: దసరా సందర్భంగా నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమంలో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మత ఆధారిత జనాభా అసమతుల్యతను విస్మరించలేమని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశ విభజనకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా విడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్ పూర్ లో బుధవారం ఏర్పాటు చేసి వార్షిక దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తోలిసారిగా ప్రముఖ పర్వతారోహకురాలు మహిళ అయిన సంతోష్ యాదవ్ ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జనాభా నియంత్రణ కోసం భారత్ ‘‘ అందరికి సమానంగా వర్తించే’’ విధానం అవసరమని వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణతో పాటు మత పరమైన జనాభా సమతుల్యత కూడా విస్మరించవద్దని అన్నారు. ఇటీవల కాలంలో దేశంలో శాంతి సామరస్యం పెంపొందించేందుకు పలువురు ముస్లిం మేధావులు, మతగురువులతో సమావేశం అయిన తర్వాత మోహన్ భగవత్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు తైమూర్, దక్షిణ సూడాన్ దేశాలు మత సమాజ ఆధారితంగా ఏర్పడిన దేశాలకు ఉదాహరణలని ఆయన అన్నారు.

Read Also: Bharat Rashtra Samithi: బీఆర్ఎస్‌పై కేసీఆర్‌ ప్రకటన ఇదే..

జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దులలో మార్పులు తెస్తుందని.. జననాల రేటులో తేడాలతో పాటు.. బలవంతంగా మతం మారడం, ప్రలోభాలకు మతమార్పిడి, చొరబాట్లు కూడా జనాభా అసమతుల్యతకు కారణం అవుతున్నాయని ఆయన అన్నారు. మైనారిటీల్లో భయాలు ఏర్పడటంపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మా వల్ల మైనారిటీలకు ప్రమాదం ఉందని కొందరు భయపెట్టడం చేస్తున్నారని.. ఇది సంఘ్, హిందువుల స్వభావం కాదని.. సౌభ్రాతృత్వం, శాంతి వైపు సమాజం ఉండాలన్నారు.

మైనారిటీ సంఘాల సభ్యులతో చర్చలు కొనసాగుతాయని..దేశంలో హింసాత్మక ఘటనలను ముస్లిం ప్రముఖులు ఖండిచారని.. శాంతి, సామరస్యతంతో జీవించేందుక మేం అండగా ఉన్నామని మోహన్ భగవత్ అన్నారు. హిందూ రాష్ట్రానికి సంబంధించిన చర్చపై మోహన్ భగవత్ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర భావన సర్వత్రా చర్చ జరుగుతోందని.. చాలా మంది ఈ భావనతో ఏకీభవిస్తున్నారు..కానీ హిందూ అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

Exit mobile version