BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. రూ.2.3 కోట్లు చోరీ
- కర్ణాటకలోని సహకరా బ్యాంకులో దోపిడీ..
- బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ. 2.3 కోట్లు చోరీ..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బళ్లారి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BDCC Bank: కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు. కాగా, 2025 జనవరి 10వ తేదీ నుంచి విజయనగరం, బళ్లారి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బళ్లారి జిల్లా సహకార కేంద్ర (బీడీసీసీ) బ్యాంకుకు చెందిన కస్టమర్ల ఖాతాలకు ఆన్లైన్ లో బదిలీలు జమ కావడం లేదని పలు శాఖలు నివేదించడంతో.. జనవరి 13వ తేదీన ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే, 10వ తేదీన బీడీసీసీ బ్యాంక్ నుంచి ఐడీబీఐ బ్యాంక్‌కి సాధారణ నిధుల బదిలీ సమయంలో హ్యాకర్లు ఎక్స్ఎంఎల్ ఫైల్లలో ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్చగలిగారని ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, కస్టమర్ల పేర్లు మార్చకుండానే.. ఉత్తర భారత్ లోని పలు రాష్ట్రాల్లోని 25 వేర్వేరు ఖాతాలకు నిధులు జమ చేయబడ్డాయి.
Read Also: Fake IAS: నకిలీ ఐఏఎస్ అధికారిణిని గుర్తించాం.. కఠిన చర్యలు తీసుకుంటాం: విశాఖ సీపీ
Also Read
- India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
- CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
- India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
- Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
ఇక, రూ. 5 లక్షలకుపైగా లావాదేవీలు ఇతర ఖాతాలకు మాయమైనట్లు బ్యాంకు విచారణలో తేలింది. దీంతో బ్యాంక్ సిబ్బంది వెంటనే దాని ఆర్టీజీఎస్/ ఎన్ఈఎఫ్టీ సేవలను నిలిపివేసి.. హోసాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసును బళ్లారి సైబర్ ఎకనామిక్ నార్కోటిక్స్ పీఎస్ కు బదిలీ చేయగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత్ న్యాయ్ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లావాదేవీల కోసం ఉపయోగించిన కంప్యూటర్ యొక్క వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!