Site icon NTV Telugu

Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!

Biharmoney

Biharmoney

బీహార్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులు ఒకరికి వేస్తే.. ఇంకొకరికి బదిలీ అయ్యాయి. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వాటిని తీసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. అసలేం జరిగింది. డబ్బుల గొడవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్‌ప్లాజాల మూసివేతకు ఆదేశం

నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్డీఏ కూటమి మహిళలకు డబ్బులు బదిలీ చేసింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల ఖాతాలకు నగదు పంపించింది. డబ్బులు అందుకున్న మహిళలంతా సంతోషంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. మహిళలకు వేయడం వరకు బాగానే ఉంది. కానీ వాళ్లతో పాటు పురుషుల ఖాతాల్లో కూడా నగదు జమ కావడం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తిరిగి వారి దగ్గర నుంచి రాబట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్‌పై మమతను ప్రశ్నించిన బీజేపీ

సాంకేతిక లోపం కారణంగా దర్భంగా జిల్లాలో పలువురి పురుషుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ అయినట్లుగా అధికారులు గుర్తించారు. పొరపాటును గుర్తించిన అధికారులు తిరిగి తీసుకునేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ డబ్బుతో ఇంటికి అవసరం అయిన వస్తువులు కొనుగోలు చేసేశామని.. తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. వాటిని వదిలేసుకోవాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను గ్రామస్తులు కోరుతున్నారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్‌లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టించింది. ఏకంగా ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలుచుకుంది. విపక్ష కూటమి చతికిలపడింది. గతంలో కంటే దిగజారిపోయింది.

Exit mobile version