NTV Telugu Site icon

Royal Enfield: రూ. 18 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. వైరల్ అవుతోన్న బిల్లు

Royal Enfield Bike

Royal Enfield Bike

Royal Enfield Bullet 350cc Priced At 18 Thousand Rupees: మన దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ ఒకటి. ఇది మార్కెట్‌లోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే.. మేకర్స్ కూడా దీని లుక్ మార్చట్లేదు. కాలానికి అనుగుణంగా టెక్నికల్ మార్పులైతే చేస్తున్నారు కానీ, ఈ బైక్ పట్ల జనాలకు అనుభూతి దెబ్బతినకుండా ఉండేందుకు లుక్ విషయంలో మార్పులు చేపట్టడం లేదు. ఇది లాంగెస్ట్ రన్నింగ్ మోడల్ కావడంతో.. ఇదొక లెజెండరీ బైక్‌గా అవతరించింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ రూ. 2.2 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.

కానీ.. ఒకప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ. 18,700 మాత్రమేనన్న విషయం మీకు తెలుసా? అవును.. 1986లో దీని ఖరీదు వేలల్లోనే ఉండేది. ఇందుకు సంబంధించిన బిల్లుని ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాన్ని ఇన్‌స్టాలో ఇలా పోస్ట్ చేయడమే ఆలస్యం, క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ బిల్లు జార్ఖండ్‌లోని సందీప్ ఆటో కంపెనీ డీలర్‌కు చెందినది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏంటి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ ధర ఇంత తక్కువనా’ అంటూ నోరెళ్లబెట్టుకుంటున్నారు. బహుశా ఆ ధర ఇప్పుడు తక్కువే కావొచ్చేమో గానీ.. ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. భారత సైన్యం కూడా ఈ బైక్‌ని సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసేందుకు ఎక్కువగా వినియోగించింది.

Police Officer House Robbed: ఇంట్లో చోరీ.. బాబా సాయం కోరిన పోలీస్ అధికారి

ఈ బిల్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులు రంగంలోకి దిగి, నాటి జ్ఞాపకాల్ని, ఈ బైక్‌తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఈ పోస్ట్ కింద కామెంట్ పెడుతూ.. తాను 1984 ఫిబ్రవరిలో ఈ మోడల్‌ను రూ.16,100 కే కొన్నానని, 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ దాన్నే వాడుతున్నానని పేర్కొన్నాడు. మరో యూజర్ ట్వీట్ చేస్తూ.. ‘‘తాను 1980లోనే ఈ మోడల్ బైక్‌ని రూ.10,500కి కొన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.