Royal Enfield: రూ. 18 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. వైరల్ అవుతోన్న బిల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield Bullet 350cc Priced At 18 Thousand Rupees: మన దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ ఒకటి. ఇది మార్కెట్‌లోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే.. మేకర్స్ కూడా దీని లుక్ మార్చట్లేదు. కాలానికి అనుగుణంగా టెక్నికల్ మార్పులైతే చేస్తున్నారు కానీ, ఈ బైక్ పట్ల జనాలకు అనుభూతి దెబ్బతినకుండా ఉండేందుకు లుక్ విషయంలో మార్పులు చేపట్టడం లేదు. ఇది లాంగెస్ట్ రన్నింగ్ మోడల్ కావడంతో.. ఇదొక లెజెండరీ బైక్‌గా అవతరించింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ రూ. 2.2 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
కానీ.. ఒకప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ. 18,700 మాత్రమేనన్న విషయం మీకు తెలుసా? అవును.. 1986లో దీని ఖరీదు వేలల్లోనే ఉండేది. ఇందుకు సంబంధించిన బిల్లుని ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాన్ని ఇన్‌స్టాలో ఇలా పోస్ట్ చేయడమే ఆలస్యం, క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ బిల్లు జార్ఖండ్‌లోని సందీప్ ఆటో కంపెనీ డీలర్‌కు చెందినది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏంటి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ ధర ఇంత తక్కువనా’ అంటూ నోరెళ్లబెట్టుకుంటున్నారు. బహుశా ఆ ధర ఇప్పుడు తక్కువే కావొచ్చేమో గానీ.. ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. భారత సైన్యం కూడా ఈ బైక్‌ని సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసేందుకు ఎక్కువగా వినియోగించింది.
Police Officer House Robbed: ఇంట్లో చోరీ.. బాబా సాయం కోరిన పోలీస్ అధికారి
ఈ బిల్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులు రంగంలోకి దిగి, నాటి జ్ఞాపకాల్ని, ఈ బైక్‌తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఈ పోస్ట్ కింద కామెంట్ పెడుతూ.. తాను 1984 ఫిబ్రవరిలో ఈ మోడల్‌ను రూ.16,100 కే కొన్నానని, 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ దాన్నే వాడుతున్నానని పేర్కొన్నాడు. మరో యూజర్ ట్వీట్ చేస్తూ.. ‘‘తాను 1980లోనే ఈ మోడల్ బైక్‌ని రూ.10,500కి కొన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
-
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!