NTV Telugu Site icon

Namaz Controversy: క్యాంపస్‌లో నమాజ్ చదివిన విద్యార్థులు.. రాజుకున్న వివాదం

University Namaz Row

University Namaz Row

Row After 2 Students Offer Namaz Inside Gujarat Varsity Campus: గుజరాత్‌లోని ఒక యూనివర్శిటీలో ఇద్దరు విద్యార్థులు నమాజ్ చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం (MSU) క్యాంపస్‌లో వాళ్లు నమాజ్ చదివిన వీడియో బయటకు రావడమే ఆలస్యం.. ఒక్కసారిగా వివాదం రాజుకుంది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వెంటనే రంగంలోకి దిగి.. క్యాంపస్‌లో నమాజ్ చదవడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఎక్కడైనా నమాజ్ చదివారో, ఆ ప్రదేశంలో గంగాజలం చల్లారు. రామ్-ధున్ నిర్వహించి, వర్శిటీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించారు.

MP Pragya Thakur: ఇళ్లల్లో కత్తులు ఉంచుకోండి.. ఎప్పుడైనా అవసరం పడుతుంది

సోమవారం ఉదయం క్యాంపస్‌లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో ఇద్దరు యువకులు నమాజ్ చేసిన ఒక వీడియో బయటకు వచ్చింది. వాళ్లు నమాజ్ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే.. వర్శిటీ విజిలెన్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే.. వర్శిటీ భవనంలో పరీక్షలు జరుగుతున్నందున శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుల్ని పిలిపించామని ఆ వర్శిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లకులీష్ త్రివేది తెలిపారు. నమాజ్ చదివిన ఆ ఇద్దరు విద్యార్థులకు బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారని, పరీక్షలు రాడానికి వచ్చిన వాళ్లు లోపలికి వెళ్లే ముందు నమాజ్ చదివారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత వర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వారికి కౌన్సిలింగ్ ఇస్తుందని, వర్శిటీల్లో నమాజ్ చదవకూడదన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్తారని చెప్పారు.

Mock Drill: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. సంసిద్ధంగా గాంధీ హాస్పిట‌ల్‌

మరోవైపు.. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ, విద్యార్థులు ఇలా విద్యా క్యాంపస్‌లలో నమాజ్ చదవకూడదన్నారు. విద్యాసంస్థలు పుణ్యప్రదమైనవని, అలాంటి పనులు చేయడం మానుకోవాలని కోరారు. అయితే.. విశ్వహిందూ పరిషత్‌కి చెందిన విష్ణు ప్రజాపతి అనే లీడర్ మాత్రం ఇలాంటి ఘటనలు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ హిందువులకు సవాల్ విసురుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. క్యాంపస్‌లో భద్రతను కఠినతరం చేయాలని తాము మెమొరండం అందజేస్తామని చెప్పారు.

Woman SI Affair: డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..

Show comments