NTV Telugu Site icon

Arikomban: మళ్లీ ప్రజలపై దాడులు మొదలుపెట్టిన పోకిరి ఏనుగు “అరికొంబన్”

Arikomban

Arikomban

Arikomban: గత నెలలో కేరళలో విధ్వంస సృష్టించి వార్తల్లో నిలిచిన పోకిరి ఏనుగు ‘‘ అరికొంబన్’’ మళ్లీ దాడులను ప్రారంభించింది. కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించి అక్కడ దాడులకు పాల్పడుతోంది. తమిళానాడు తేనిలోకి ప్రవేశించి అక్కడ ప్రజలపై దాడులు చేసింది. ఇటీవల కేరళలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ నుంచి పట్టుబడిని అరికొంబన్ ను పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు అటవీ అధికారులు. ఆ తరువాత అక్కడి నుంచి తప్పించుకుని తమిళనాడు చేరింది.

శనివారం తమిళనాడులోని తేని జిల్లాలోని కుంబం గ్రామంలోని ఓ వ్యక్తిపై దాడి చేసి, పలు ఆస్తుల్ని ధ్వంసం చేసింది. మొదటగా కేరళలోని కుమిలి జనావాసానికి చేరుకున్న ఏనుగును ఫారెస్ట్ అధికారులు ఆకాశంలోకి కాల్పులు జరిపి అడవిలోకి తిరిగి పంపారు. అంతకుముందు రోజు శుక్రవారం రాత్రి కొచ్చిలో ఉన్న కజుత్తుముట్టులో పంటలను నాశనం చేసింది. ఆపరేషన్ అరికొంబన్ పేరుతో గత నెలలో అటవీ అధికారులు ఏనుగును పట్టుకున్న తర్వాత దాని కదలికను కనిపెట్టేందుకు జీపీఎస్ అమర్చారు. అయినా దాన్ని పట్టుకోలేకపోతున్నారు అధికారులు. మున్నార్ ప్రాంతంలో సంచరిస్తున్నందున అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న గ్రామస్థులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: North Korea: బైబిల్‌తో పట్టుబడిన తల్లిదండ్రులకు మరణిశిక్ష..2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు

అరికొంబన్ ను పట్టుకునేందుకు శిక్షణ పొందిన కుమ్కీ ఏనుగును ఉపయోగించడమో లేకపోతే దాన్ని మచ్చిక చేసుకుని ఇతర ప్రాంతాలకు తరలించడమో చేయాలని అటవీ అధికారులకు స్థానిక కంబం ఎమ్మెల్యే ఎన్ఏ రామకృష్ణన్ సూచించారు. అరికొంబన్‌ను పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. అన్నామలై నుండి కుమ్కీలు, హోసూర్ నుండి ప్రత్యేక వాహనాలు మరియు మధురై నుండి అరికొంబన్‌ను శాంతింపజేసేందుకు పశువైద్యులు తేనికి వెళ్తున్నారు.

అన్నం తినేందుకు అలవాటు పడిన ఈ అరికొంబన్(అరి – బియ్యం, కొంబన్ – ఏనుగు) అని పిలువబడే ఏనుగు బియ్యం కోసం దాడులు చేసేది. కేరళలోని రేషన్ షాపులు, ఇళ్లపై దాడులు చేసి బియ్యాన్ని తినేది.