దక్షిణ భారత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో ఘోర విషాదాన్ని నింపాయి. గంటల వ్యవధిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు ముప్పు వస్తుందో ఎవరు చెప్పలేరని అనడానికి ఈ ప్రమాదాలే ఉదాహరణలు. గమ్యానికి చేరుకునేలోపే మృత్యువు రోడ్డుప్రమాదాల రూపంలో రావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలోని తిరుచి చెన్నై జాతీయ రహదారిపై చెన్నైకి వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ముందు టైర్లు పంచర్ అవ్వడంతో అదుపుతప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి దుర్మరణం చెందారు.
ఇక గురువారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవదహనం అయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీదహనం అయ్యారు. ఇలా రెండు రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్దీ గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
