Site icon NTV Telugu

Bakhtiarpur Car Accident: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

Bihar

Bihar

Bakhtiarpur Car Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తియార్‌పూర్‌- బీహార్‌షరీఫ్‌ రోడ్డులోని మానసరోవర్‌ పంప్‌ సమీపంలో స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరడజకు పైగా మందిని పాట్నాలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరూ నవాడా జిల్లా నార్హత్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఖైరా నుంచి ఉమానాథ్‌కు బార్హ్ ముందన్ సంస్కార్ కోసం వెళ్తున్నారు. కాగా, భక్తియార్‌పూర్ సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్

అయితే, ఈ నెల 7వ తేదీన కూడా బీహార్ రాష్ట్రంలో బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలోని పెట్‌భారీ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా దాదాపు ఐదుగురు మరణించారు. జీపు ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు చనిపోయారు.. మరో ఏడుగురు గాయపడినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version