Site icon NTV Telugu

Bihar Elections: 143 మందితో జాబితా విడుదల చేసిన ఆర్జేడీ

Biharelections

Biharelections

బీహార్‌లో ఎన్నికల సమరం నడుస్తోంది. రెండు విడతల్లో జరుగుతున్న పోలింగ్‌కి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశ ఎన్నికల ప్రక్రియకు నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 143 మందితో కూడిన అభ్యర్థులను జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin: వారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు.. దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆర్జేడీ ఒక సీటు తక్కువగా పోటీ చేస్తోంది. 2020లో 144 సీట్లలో పోటీ చేయగా.. 2025లో 143 సీట్లలోనే పోటీ చేస్తోంది. మాధేపుర నుంచి చంద్ర శేఖర్, మోకామా నుంచి వీణా దేవి (సురభన్ భార్య), ఝా నుంచి ఉదయ్ నారాయణ్ చౌదరి బరిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: గోవాలో నౌకాదళంతో కలిసి మోడీ దీపావళి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం మూడో జాబితాను విడుదల చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన జాబితాను హస్తం పార్టీ ప్రకటించింది. రెండు విడతల్లో జరిగే ఎన్నికల్లో మొత్తం ఇప్పటి వరకు 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది. తొలి జాబితాలో 48 మంది, రెండో జాబితాలో ఐదుగురు, తాజాగా ఆరుగురు అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఇలా మొత్తం 59 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు విపక్ష కూటమి కలిసే ఉంది. ఓటర్ యాత్ర పేరుతో రాష్ట్రమంతా చుట్టేశారు. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సీట్ల పంపకాలలో తేడానో.. లేదంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తిరకాసో తెలియదు గానీ.. చివరి నిమిషంలో ఇండియా కూటమి చీలిపోయింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సొంతంగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న విపక్ష కూటమి కలలు కల్లలైనట్లుగానే కనిపిస్తున్నాయి. విపక్ష కూటమి చీలికను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది. ఆయా హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

Exit mobile version