Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా జడేజా భార్య.. ఈనెల 12న ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rivaba Jadeja: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా అద్భుత రీతిలో విజయం సాధించారు. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రివాబా జడేజా సమీప అభ్యర్థిపై 61,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ఆమె మరో జాక్‌పాట్ కొట్టారని ప్రచారం జరుగుతోంది. భూపేంద్ర పటేల్ కేబినెట్‌లో రివాబాకు కూడా స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు పటీదార్ రిజర్వేషన్ల పోరాటంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్ కూడా మంత్రి పదవి దక్కించుకోనున్నట్లు సమాచారం. ఈనెల 12న గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ కేబినెట్ కొలువుదీరనుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గంతో సహా గురువారం రాజీనామా చేశారు.
Read Also: Virat Kohli: కోహ్లీకి కలిసొచ్చిన రాహుల్.. రికార్డులే రికార్డులు
ఈనెల 12న కొత్త కేబినెట్‌లో సీఎం భూపేంద్ర పటేల్ సహా 12 మంది వరకు మంత్రులుగా ప్రమాణం చేయవచ్చని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు. కాగా రివాబా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఆమె 2019లో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరకముందు ఆమె కర్నిసేన మహిళా విభాగం చీఫ్‌గా పనిచేశారు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. రివాబాకు మద్దతుగా రవీంద్ర జడేజా భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేశాడు. సొంత చెల్లెలు నైనా జడేజా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!