Rivaba Jadeja: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా అద్భుత రీతిలో విజయం సాధించారు. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రివాబా జడేజా సమీప అభ్యర్థిపై 61,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజాగా ఆమె మరో జాక్‌పాట్ కొట్టారని ప్రచారం జరుగుతోంది. భూపేంద్ర పటేల్ కేబినెట్‌లో రివాబాకు కూడా స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు పటీదార్ రిజర్వేషన్ల…