Waqf Bill: నితీష్ కుమార్ పార్టీలో ‘వక్ఫ్ బిల్లు’ కల్లోలం.. రెండుగా చీలిన నేతలు..
- జేడీయూలో వక్ఫ్ బిల్లు కల్లోలం..
- బిల్లుపై రెండుగా చీలిన నేతలు..
- అంతర్గత విభేదాలపై నితీష్ కుమార్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాల’కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ ఈ బిల్లుకు లోక్‌సభలో మద్దతు ప్రకటించింది. కాగా, క్షేత్రస్థాయిలో మాత్రం నితీష్ కుమార్‌కి చెందిన జేడీయూ పార్టీలో ‘వక్ఫ్ బిల్లు’ చీలికలువ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు.
Read Also: Japan: జపనీయులను వెంటాడుతున్న సునామీ భయం.. వెలవెలబోతున్న షాపింగ్ మాల్స్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇటీవల బిల్లుకు జేడీయూ ఎంపీ, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మద్దతు తెలిపారు. ఇది వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి తెచ్చిన బిల్లుగా పేర్కొన్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు మసీదు లేదా దేవాలయానికి సంబంధించింది కాదని, వక్ఫ్ బోర్డుల పారదర్శకతను ప్రోత్సహించడానికి తెచ్చినదని చెప్పారు. అయితే, రంజన్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్సీ గులాం గౌస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 7 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా బీజేపీ ఈ బిల్లుని తీసుకువచ్చిందని అన్నారు. వక్ఫ్ భూముల్ని లాక్కోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు.
మరో జేడీయూ నేత, ముఖ్యమంత్రి కీలక సహాయకుడు విజయ్ కుమార్ చౌదరి వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపాలన్న కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసించారు. మైనారిటీ కమ్యూనిటీలో ఈ బిల్లుపై భయాలు ఉన్నాయని, అయితే జేపీసీ పరిశీలనకు పంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలను అత్యంత సున్నితత్వంతో పరిష్కరించాలని మా నేత నితీష్ కుమార్ నమ్ముతారని అన్నారు. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు నితీస్ కుమార్ పార్టీ నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!