NTV Telugu Site icon

Restaurant: ఫుడ్ ఆర్డర్‌తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కి రూ. 35000 ఫైన్..

Restaurant

Restaurant

Restaurant: వినియోగదారుడికి సరైన సేవల్ని అందించలేని రెస్టారెంట్‌కి కోర్టు భారీ జరిమానాను విధించింది. రెస్టారెంట్ సేవల్లో లోపం, వినియోగదారుడికి శారీరక, మానసిక వేదనను మిగిల్చిందని కోర్టు పేర్కొంది. ‘‘ఊరగాయ’’ని ఇవ్వకుండా కస్టమర్‌కి మానసకి వేదన కలిగించినందుకు రెస్టారెంట్‌కి రూ. 35,000 జరిమానా విధించారు. నవంబర్ 2022లో సీ ఆరోగ్యస్వామి అనే కస్టమర్ రూ. 2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే, దాంట్లో హోటల్ బాలమురుగన్ ‘పికిల్’ ఇవ్వలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

Read Also: UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..

ఇటీవల తమిళనాడులోని విల్లుపురం న్యాయస్థానం రూ.2000 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్‌లో భాగంగా ఉన్న ఊరగాయను డెలివరీ చేయనందుకు పరిహారంతో పాటు కేసు కోసం బాధితుడికి అయిన ఖర్చులతో కలిపి రూ. 35,000 చెల్లించాలని రెస్టారెంట్ యజమానిని ఆదేశించింది. ఆరోగ్యస్వామి తన బంధువు మరణించి ఏడాది కావడంతో 25 మందికి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే, అందులో ఊరగాయ ఇవ్వలేదు. రెస్టారెంట్ సర్వీస్ లోపాలకు సమానమని, ఇది కస్టమర్‌కి శారీరక కష్టాల్ని, మానసిక వేదనని మిగిల్చిందని కోర్టు పేర్కొంది. బాధిత కస్టమర్ కొనుగోలు చేసిన 25 భోజనాలకు రసీదు కూడా ఇవ్వలేదని కోర్టు గుర్తించింది.

ఈ కేసులో న్యాయస్థానం రెస్టారెంట్‌కి రూ. 5000 న్యాయపరమైన ఖర్చులతో పాటు రూ. 30,000 జరిమానా విధించింది. ప్రతీ భోజన పార్సిల్‌లో వైట్ రైస్, సాంబార్, కూర, రసం, మజ్జిగ, కూట్టు, పొరియాల్, అప్పలం, ఊరగాయ, పెద్ద సైజు అరటి ఆకులు మరియు కవర్ ఉంటాయని హోటల్ ముందుగా చెప్పింది. ఒక్కో పార్సిల్‌కి రూ. 80 వసూలు చేసింది. అయితే, భోజనంలో పచ్చళ్లు లేకపోవడంతో తనకు అవమానం ఎదురైందని కస్టమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఊరగాయ వచ్చే సమయానికి అతిథులందరూ తమ భోజనం ముగించాని ఫిర్యాదులో వెల్లడించారు.