రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 5న నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. తాజా ప్రకటనతో గృహ కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది. గృహ రుణ ఈఎంఐలు, వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
ఇది కూడా చదవండి: Asim Munir: అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్.. ఈసారి కీలక బాధ్యతలు! దేనికోసమో..!
ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా.. జూన్ సమీక్షలో మాత్రం ఏకంగా 50 పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1.25 శాతం తగ్గించినట్లైంది. 2020, మే నెల తర్వాత ఇంతగా తగ్గడం ఇదే తొలిసారి. మొత్తానికి ఏడాది చివరిలో సామాన్యులకు ఊరట కలిగించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: IndiGo Flights: ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం.. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
