Rescue operation For Eagle: మానవత్వం మంట గలుస్తోంది.. సాటి మనిషి ఆపదలో ఉంటే.. పట్టించుకునేవారు కాదు.. పలకరించేవారు కూడా కరువవుతున్నారు. అయితే, ఓ జవాన్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ ప్రాణినిచూసి అల్లాడిపోయాడు.. వెంటనే సమాచారం ఇచ్చాడు.. చివరకు దానిని ప్రాణాలతో కాపాడగలిగాడు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లో ఓ చెట్టుపై గద్ద వేలాడుతోంది.. అది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన ఓ జవాన్ కంటపడింది.. కైట్స్ ఎగురవేసేందుకు వినియోగించే మాంఝా చుట్టుకోవడంతో.. అది చెట్టుకు వేలాడుతున్నట్టు గ్రహించారు.. ఎలాగైనా దానిని కాపాడాలనుకున్నారు.. దీంతో, వెంటనే ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం ఇచ్చారు.. ఇక, ఆ ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. గద్దను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఆ గద్దను రక్షించారు.. ఇది, కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారింది. కాగా, ఈ రోజుల్లో మనుషులు ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నా.. మాకు ఎందుకులే.. అంటూ పక్కనుంచి వెళ్లిపోయేవారు ఎందరో తయారయ్యారు.. ఎవరిపట్లో కాదు.. కన్నవారిపై, కట్టుకున్నవారిపై, కనిపెంచినవారిపై కూడా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ చూస్తూనేఉన్నాం.. మానవత్వం మరచి ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
Read Also: CM Jagan: ఈనెల 18న నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన