NTV Telugu Site icon

Manoj Kumar Sharma: ‘12th ఫెయిల్’ ఐపీఎస్ అధికారికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్..

12th Fail

12th Fail

Manoj Kumar Sharma:‘12th ఫెయిల్’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన అత్యుత్తమ చిత్రంగా ఉంది. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. సివిల్స్ సాధించేందుకు ఒక సాధారణ యువకుడు ఎదుర్కొన్న సంఘటనలు ప్రేక్షకులను కట్టిపారేశాయి. ఐపీఎస్‌ అయ్యేందుకు ఎలాంటి అడ్డుంకులు ఎదుర్కొన్నాడు, అమ్మాయి ప్రేమ ఉన్నత లక్ష్యాన్ని సాధించేందు ఎలా సహకరించిందనే విషయాలను డైరెక్టర్ విధువినోద్ చోప్రా తెరకెక్కించారు. చాలా మంది యువతీయువకులకు తన లక్ష్యాలను సాధించేందుకు ఈ సినిమా ఉత్ప్రేరకంగా నిలిచింది.

Read Also: INDIA Bloc: ఎన్నికలకు ముందే ఇండియా కూటమి ముక్కలు..? ఒక్కోక్కరిగా బయటకు వెళ్తున్న నేతలు..

ఇదిలా ఉంటే తాజాగా ‘12th ఫెయిల్’ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యున్నత మెడల్ ప్రకటించింది. మహారాష్ట్ర కేడర్‌కి చెందిన 2005 బ్యాచ్ ఐపీఎస్ అయిన మనోజ్ కుమార్, బీహార్ కేడర్‌కు చెందిన అతని బ్యాచ్‌మేట్ జితేందర్ రాణా, మరికొంత మందితో కలిసి ‘మెరిటోరియస్ సర్వీస్ మెడల్’ తీసుకోనున్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ మెడల్ ప్రధానం చేయనున్నారు.

Show comments