NTV Telugu Site icon

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్.. జూలై 1ను యాత్ర ప్రారంభం..

Amarnath Yatra

Amarnath Yatra

Amarnath Yatra: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రతీ హిందువు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుందని జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 316 బ్రాంచ్‌లు, జె-కె 90 బ్రాంచ్‌లు, యెస్ బ్యాంక్ 37 బ్రాంచ్‌లు, ఎస్‌బిఐ బ్యాంక్ 99 బ్రాంచ్‌లతో సహా దేశవ్యాప్తంగా 542 బ్యాంక్ బ్రాంచ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చారు. ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీని కోసం యాత్రికుల థంబ్ స్కాన్ చేస్తారు.

Read Also: Pakistan: దైవదూషణలో చైనీయుడి అరెస్ట్.. మిత్రదేశం విషయంలో పాక్ ఏం చేస్తుందో చూడాలి..

ముమ్మర ఏర్పాట్లు..

నిబంధనల ప్రకారం 13-70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు అమర్ నాథ్ యాత్ర కోసం నమోదు చేసుకోవచ్చు. అన్ని తీర్థయాత్రలు కోసం ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6 వారాలు అంతకన్నా ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలు యాత్రకు అనుమతించబడరు. మార్చి 14న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ తీర్థయాత్రకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ సారి ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులకు అమరనాథుడిని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెలికాం సేవలు, ఆరోగ్య సేవలు, యాత్రీకులు ఉండటానికి బస, విద్యుత్, నీరు, భద్రతకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఉదయం మరియు సాయంత్రం ఆరతి (ప్రార్థనలు) ప్రత్యక్ష ప్రసారాలను కూడా ప్రారంభిస్తుంది. ఆన్లైన్ లో అనేక సేవలు పొందేందుకు ఈ సారి ప్రభుత్వం శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

హిమాలయాల్లో ఉన్న అమర్ నాథ్ క్షేత్రాన్ని శివుడి నివాసం అని నమ్మతారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏలా లక్షల్లో భక్తులు వస్తుంటారు. అనంత్‌నాగ్ జిల్లాలో జిల్లా కేంద్రానికి 168 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తులో రాజధాని శ్రీనగర్ నుండి 141 కి.మీ దూరంలో ఉన్న గుఫా లాడార్ లోయలో ఉంది. సంవత్సరంలో చాలా భాగం ఈ క్షేత్రాన్ని మూసేస్తారు. వేసవిలో భక్తుల దర్శనానికి అనుమతిస్తుంటారు.