Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?

  • రెడ్ ఫోర్ట్ పేలుడుపై NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
  • తొలుత లాల్ మందిర్ సమీపంలో కారు పార్క్ చేయాలని ఉమర్ ప్రయత్నం
  • భారీ ట్రాఫిక్, పోలీసుల ఉనికితో ప్లాన్ మారిందని NIA వెల్లడి
Delhi Car Blast

Delhi Car Blast

Red Fort Blast: గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలింది. కారులో పేలుడు పదార్థాలు నింపుకుని, ఉమర్ ఉన్ నబీ అనే నిందితుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 29 మంది గాయపడ్డారు. హర్యానాలో ఒక మెడికల్ కాలేజీతో సంబంధం ఉండటం సంచలనంగా మారింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

ఎన్‌ఐఏ చార్జిషీట్ ప్రకారం.. ముందుగా చాందినీ చౌక్‌లోన లాల్ మందిర్ వద్ద కారును పార్క్ చేసిన, పేల్చాలని భావించినట్లు తేలింది. నవంబర్ 10న సాయంత్రం సుమారు 6.37 గంటలకు ఉమర్ తన కారును లాల్ మందిర్ సమీపంలో నిలిపేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ భారీ ట్రాఫిక్‌తో పాటు పోలీసుల ఉనికి ఉండటంతో అతడు అక్కడ కారును ఆపలేకపోయాడు. దీంతో యూ-టర్న్ తీసుకుని రెడ్ ఫోర్ట్ వైపు వెళ్లినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

పేలుడుకు ముందు ఉమర్ నూహ్‌లోని ఓ అద్దె గదిలో సుమారు 11 రోజలు పాటు నివసించాడు. అక్కడే పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన కార్యకలాపాలు జరిగాయని ఎన్ఐఏ ఆరోపించింది. ఉమర్ 2023 నుంచి 2025 వరకు ఎర్రకోటను 12 సార్లు సందర్శించినట్లు ఎన్ఐఏ గత దర్యాప్తులో తెలిపింది. చివరిసారిగా 2025, మే 1న అక్కడికి వెళ్లినట్లు పేర్కొంది. ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ కేసులో ఉమర్ తో పాటు మరో అనుమానితుడు షాహీన్ సయీద్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో లభించిన ఆధారాల్లో యూరియా నైట్రేట్‌‌ను ఉపయోగించి పేడు పదార్థాలు తయారీకి సంబంధించిన వివరాలు ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.