Agnipath: అగ్నిపథ్ నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశంగా అగ్నిపథ్ నిలిచింది. ఈ స్కీమ్‌పై దేశంలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అగ్నిపథ్పథకం కింద నియమించే సైనిక నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. విద్యార్హతలు, పరీక్ష సిలబస్, వైద్యప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. రిక్రూట్‌మెంట్లపై సవివర షెడ్యూల్ విడుదల చేశారు.
రక్షణ మంత్రిత్వశాఖలోని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ నియామకం గురించిన వివరాలను వెల్లడించారు. త్రివిధ దళాల నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని.. ఇంతకుముందు జరిగిన రీతిలోనే ఇది సాగుతుందన్నారు. అత్యుత్తమ నైపుణ్యాలను ఆకర్షించేందుకు అగ్నిపథ్‌ను తెచ్చామని.. ఇది సైనిక దళాలకు అదనపు బలమవుతుందని అని అనిల్ పురీ వెల్లడించారు. ‘అగ్నివీరులు’గా నియమితులయ్యేవారు సాహస పురస్కారాలకూ అర్హులేనని తెలిపారు. అగ్నిపథ్ కింద ఆర్మీలో మహిళలకూ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అగ్నిపథ్ కింద త్రివిధ దళాల్లో చేపట్టయే నియామక ప్రక్రియపై సవివర షెడ్యూల్‌ను త్రివిధ దళాల ఉన్నతాధికారులు విడుదల చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
సైన్యంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జులై 1 నుంచి మొదలవుతుంది. నియామక ర్యాలీలు ఆగస్టు రెండో వారం నుంచి ఆరంభమవుతాయి. మొదటి బ్యాచ్ అగ్నివీరుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష అక్టోబరు 16, నవంబరు 13 తేదీల్లో జరుగనుంది. ఎంపికైనవారు డిసెంబరు 22న శిక్షణ కేంద్రాల్లో చేరాలి. వీరు శిక్షణ పూర్తిచేసుకొని, వచ్చే ఏడాది జులై 23న సంబంధిత యూనిట్లలో విధుల్లో చేరతారు. రెండో బ్యాచ్‌కి ఉమ్మడి ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 23న జరుగుతుంది. ఎంపికైనవారు ఫిబ్రవరి 23న సైనిక శిక్షణ కేంద్రంలో చేరాలి. ఆశావహుల సందేహాలను తీర్చడానికి అగ్నివీర్ హెల్ప్‌లైన్‌ను కూడా సైన్యం ప్రారంభించింది.
వైమానిక దళంలో అభ్యర్థుల నమోదు ప్రక్రియ జూన్ 24 నుంచి జులై 5 వరకూ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జులై 24 నుంచి 31 వరకూ ఉంటుంది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 10 కల్లా కాల్‌లెటర్లు జారీ అవుతాయి. వారికి ఆగస్టు 29 నుంచి నవంబరు 8 మధ్య వైద్య పరీక్షలు జరుగుతాయి. ప్రాథమికంగా ఎంపికైన వారితో కూడిన జాబితాను డిసెంబరు 1న విడుదల చేస్తారు. ఎంపికైన వారికి డిసెంబరు 11న కాల్ లెటర్లు పంపిస్తారు. అదే నెల 30న శిక్షణ ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరంలో రెండు శాతం మంది అగ్నివీరులను నియమిస్తారు. ఐదో సంవత్సరం కల్లా ఈ సంఖ్య 6వేలకు చేరుతుంది.
నౌకాదళంలో చేరాలనుకునేవారికి సంబంధించి నమోదు ప్రక్రియ వివరాలు నేడు వెలువడనున్నాయి. నమోదు జులై 1 నుంచి ప్రారంభమవుతుంది. సవివర నోటిఫికేషన్ జులైలో ప్రచురితమవుతుంది. అదే నెల 15 నుంచి 30 వరకూ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. రాత, దేహదారుఢ్య పరీక్షలు అక్టోబరు మధ్యలో జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థులకు నవంబరు 21 నుంచి శిక్షణ మొదలవుతుంది. నౌకాదళంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులు మర్చంట్ నేవీలో చేరవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!