NTV Telugu Site icon

Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..

Haryana

Haryana

Dushyant Chautala: హర్యానాలో బీజేపీ పొత్తు నుంచి విడిపోయాక, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని గురువారం చెప్పారు. బీజేపీతో ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. హర్యానాలో గత ఎన్నికల అనంతరం బీజేపీ, జేజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, 4.5 ఏళ్ల తర్వాత ఈ పొత్తు విడిపోయింది. మనోహర్ లాల్ కట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేయడంతో బీజేపీతో, జేజేపీ పొత్తును ముగించింది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ కూడా రెండు పార్టీల మధ్య విబేధాలను తీసుకువచ్చాయి.

Read Also: West Godavari: తాడేపల్లిగూడెంలో దంపతుల మృతి.. విద్యుత్‌ షాక్‌తో భార్య.. కాపాడబోయి భర్త మృతి

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 05 స్థానాల్లో గెలిచాయి. ఒంటరిగా పోటీ చేసిన జేజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అయితే, కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా రోహ్‌తక్ నుంచి పోటీ చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. దీనికి ఎన్నికలు జరగనున్నాయి. తమ పార్టీ లాభనష్టాలను బీజేపీతో పొత్తు ప్రభావితం చేసినట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన రైతు ఉద్యమాన్ని కూడా తమ పార్టీ భరించాల్సి వచ్చిందని అన్నారు. కార్యకర్తలతో చర్చించి బీజేపీ కాకుండా ఏ పార్టీలో పొత్తు పెట్టుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చౌతాలా చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఓడిపోయేందుకు బీజేపీనే కారణమని అన్నారు.

రాజ్యసభ స్థానానికి ప్రముఖ వ్యక్తిని లేదా ఎవరైనా క్రీడాకారుడిని బరిలోకి దింపితే తాము కాంగ్రెస్‌కి మద్దతిస్తామని అన్నారు.కాంగ్రెస్ నిజంగా బిజెపిని ఎదుర్కోవాలనుకుంటే, వారు గెలుపు ఓటములను చూడకూడదని, వారు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇస్తామన్నారు. ఒక వేళ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించకుంటే అది ఆ రెండు పార్టీల మధ్య పొత్తను సూచిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌లా తమకు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే గెలుపోటములను ఆలోచించకుండా అభ్యర్థిని నిలబెట్టేవారని చెప్పారు.