NTV Telugu Site icon

RBI website crash: రూ. 2,000 నోటు రద్దు తర్వాత RBI వెబ్‌సైట్ క్రాష్

Rbi

Rbi

RBI website crash: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెల్లడించిన కొద్ది సేపటికే ఆర్బీఐ అధికార వెబ్‌సైట్ క్రాష్ అయింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ని సెర్చ్ చేయడంతో క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల నాటి ₹2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రకటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు పరుగులు తీయడంతో సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది.

Read Also: Rs 2,000 Note Withdrawn: రూ.2000 నోటు @ 7 ఏళ్లు.. ఎందుకు రద్దు అంటే..?

అంతకుముందు, నవంబర్ 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా రూ. 500 , రూ. 1,000 నోట్లను రద్దు చేసిన తర్వాత భారీ ట్రాఫిక్ తర్వాత వెబ్‌సైట్ ఇలాగే క్రాష్ అయింది. ఈ ప్రకటనలు ఆ సమయంలో పెట్రోల్ పంపుల్లో, ఏటీఎంల ముందు భారీ క్యూలకు కారణం అయింది. రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ మార్పికి ప్రత్యేక సౌకర్యాలు అందించాలని ఆర్బీఐ బ్యాంకుల్ని కోరింది.