Site icon NTV Telugu

Digital Rupee: నేడు డిజిటల్ రూపాయి ప్రారంభం.. తొలి విడతలో నాలుగు నగరాల్లో లాంచ్

Digital Rupee

Digital Rupee

RBI to launch Digital Rupee pilot in 4 cities today: క్యాష్ లెస్ ఎకానమీ కోసం దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో తొలుత డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు రెండో విడతలో అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాల్లో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నాయి. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరపవచ్చు. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాలెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయి లావాదేవీలు చేయవచ్చు.

Read Also: Kantara: 400 కోట్లు రాబట్టిన సినిమా అక్కడ సౌండ్ చెయ్యట్లేదేంటి?

కాగితం కరెన్సీ లాగే రూ.2000, రూ. 500, రూ. 200, రూ.100 ఇలా డిజిటల్ రూపాయి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కాగితం కరెన్సీకి ఉండే చట్టభద్రత ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. వ్యాపార సంస్థల వద్ద ఉండే క్యూఆర్ కోడ్ సహాయంతో వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. అయితే వాలెట్లలో ఉండే డబ్బుపై ఎలాంటి వడ్డీ పొందము కానీ..డిజిటల్ రూపాయిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు.

యూపీఐకి ఎలా భిన్నంగా ఉంటుంది..?

2016లో భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలు వేగవంతం అయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యూపీఐ టెక్నాలజీతో దేశం మొత్తం నగదు రహిత చెల్లింపులు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ చెల్లింపుల్లో ముందుగా వినియోగదారుడు ఓ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని బ్యాంకు అకౌంట్ తో లింక్ చేయాలి. అయితే డిజిటల్ రూపాయి అనేది భౌతికంగా నగదు రూపంలోనే ఉన్నప్పటికీ దాన్ని డిజిటల్ రూపంలో లావాదేవీలు చేస్తాం. అంటే ఈ పద్ధతిలో బ్యాంకుల ఇన్వాల్వ్ మెంట్ అనేది ఉండదు. అయితే దీనికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Exit mobile version