Demonetised Currency Notes Exchange: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించిన తర్వాత.. ఏ బ్యాంకు దగ్గర చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.. పాత నోట్లు మార్చుకోవడానికి నానా కష్టాలు పడ్డారు ప్రజలు.. కొన్ని రోజులు చిల్లర కష్టాలు కూడా వేధించాయి.. అయితే, రద్దు చేయబడిన పాత నోట్లు మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చారంటూ పలు మార్లు ఫేక్ న్యూస్ వైరల్‌గా మారిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఈ మధ్య రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉంది అంటూ.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన లెటర్ ఇదేనంటూ ఓ సర్క్యులర్ కాఫీ నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. అయితే, దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది..
Read Also: CM KCR Key Meeting: 10న కేసీఆర్ కీలక సమావేశం..
తాజాగా వైరల్‌గా మారన సర్క్యులర్ విషయానికి వస్తే.. విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెటర్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది.. ఇది కేంద్రం దృష్టి వరకు వెళ్లింది.. దీంతో.. భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని స్పష్టం చేసింది.. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని.. మరో అవకాశం అంటూ సాగుతోన్న పుకార్లను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది..
