Site icon NTV Telugu

UPI Transaction: యూపీఐ లైట్‌, వ్యాలెట్‌ పరిమితులను పెంచిన ఆర్బీఐ..

Upi

Upi

UPI Transaction: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితి రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే, యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితులను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు

* ఇక, ప్రతి లావాదేవీకి యూపీఐ లైట్‌ పరిమితి ప్రస్తుతం ఉన్న రూ.500 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.
* అలాగే, యూపీఐ లైట్‌ వ్యాలెట్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొనింది.
* ప్రతి లావాదేవీకి యూపీఐ 123పే లిమిట్‌ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచేసింది.

Read Also: IPL 2025-DC: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. ఢిల్లీ రిటైన్ లిస్ట్ ఇదే!

అలాగే, యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగం పూర్తిగా మారిపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచేందుకు.. ప్రోత్సహించడానికి మేం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఆర్‌బీఐ వెల్లడించింది. ఇక, ఎలాంటి పిన్‌ ఎంటర్‌ చేయకుండానే యూపీఐ పేమెంట్స్‌ చేసేందుకు యూపీఐ లైట్‌ సేవలను వాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 నుంచి రూ. 1000కి పెంచింది ఆర్బీఐ. అయితే, యూపీఐ లైట్‌ సేవలు పొందాలనుకుంటే.. దానికోసం యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్‌ ఉంచుకోవాలి. తాజాగా, దాని పరిమితిని కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచింది. యూపీఐ 123పే అనేది స్మార్ట్‌ ఫోన్‌ కాకుండా ఫీచర్‌ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు సంబంధించింది.

Exit mobile version