Site icon NTV Telugu

Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..

Sukhdev Singh Gogamedi

Sukhdev Singh Gogamedi

Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.

Read Also: Safest City: ఇండియాలోనే సురక్షితమైన నగరం.. వరసగా మూడో ఏడాది సేఫెస్ట్ సిటీగా గుర్తింపు..

కాల్పుల అనంతరం వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించాడరని వైద్యులు ప్రకటించారు. గతంలో బాలీవుడ్ సినిమా ‘పద్మావత్’ని విడుదల చేయవద్దని జరిగిన ఆందోళనకు ఈయన నాయకత్వం వహించారు. తాజాగా జరిగిన కాల్పుల్లో గోగమేడి తల, ఛాతిపై గాయాలయ్యాయి. ‘‘ప్రాథమిక నివేదికల ప్రకారం, గోగమేడి ఉన్న ఇంట్లోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించి అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోగమేడి భద్రతా సిబ్బంది ఒకరు మరియు మరొకరు గాయపడ్డారు’’ అని రాష్ట్ర డీజీపీ ఉమేష్ మిశ్రా వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు కర్ణిసేన చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ గోగమేడిని చంపినట్లు బాధ్యత వహించాడు. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ రోహిత్ గోదారా ఈ విషయాన్ని ప్రకటించాడు. గోగమేడిని చంపిన తర్వాత రోహిత్ గోదారా తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపాడు. రాజస్థాన్ రాష్ట్రంలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ‌గా పేరున్న రోహిత్ గోదారా భారత్ నుంచి పరారీలో ఉన్నాడు. ఎన్ఐఏ అతనిపై చర్యలు తీసుకుంది. గోగమేడికి హత్యకు సంబంధించిన చిత్రాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కర్ణి సేన చీఫ్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు.
https://twitter.com/Shubham_fd/status/1731985448887537999

Exit mobile version