NTV Telugu Site icon

Rashtrapatni Row: కాంగ్రెస్ ఎంపీకి మహిళా కమిషన్ నోటీసులు..

Adhir Ranjan Chowdury

Adhir Ranjan Chowdury

Women’s Panel Issues Notice To Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేద్ధాం అని చూసిన కాంగ్రెస్ పార్టీ.. అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఢిపెన్స్ లో పడింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైంది. గురువారం లోక్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ తీరును విమర్శించారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలను, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గిరిజన మహిళను గౌరవించే సంప్రదాయం లేదని విమర్శించారు.

తాజాగా రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన మనస్తత్వాన్ని చూపిస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ రేఖ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని.. అతనిపై పార్టీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అమమానకరమైనవని.. భారతదేశ అత్యున్నత పదవిలో ఉన్న మహిళపై మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాలి.. అతను ఇతరులతో కూడా ఇలానే ప్రవర్తిస్తారా.? అని రేఖాశర్మ ప్రశ్నించారు.

Read Also: Madhya Pradesh: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. మెజారిటీ స్థానాలు కైవసం

రాష్ట్రపత్ని వ్యాఖ్య దుమారం రేపుతున్న తరుణంలో మహిళాకమిషన్ సోనియాగాంధీకి లేఖ రాసిందని రేఖాశర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధీర్ రంజన్ చౌదరిపై చర్యలు తీసుకోవాలని.. అతను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తో పాటు పలు రాష్ట్రాల మహిళాకమిషన్లు ఖండించాయి. చౌదరికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు కూడా పంపింది. ఎన్‌సిడబ్ల్యూ ముందు హాజరు కావాలని.. ఆయన వ్యాఖ్యలపై ఆగస్టు 3న విచారణ జరుగుతుందని.. వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.