Beating Heart Diamond: వజ్రం.. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువుల్లో ఒకటి. ఎన్నో ఏళ్లు భూగర్భంలో అధిక ఒత్తడి, పీడనానికి గురై వజ్రాలు తయారవుతుంటాయి. లాంటి వజ్రాలకు ప్రపంచంలో చాలా మార్కెట్ ఉంది. వజ్రాల రకాలు, దాని క్వాలిటీ, పరిమాణం, రంగు వంటి వాటిపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ సూరల్ లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి అత్యంత అరుదైన వజ్రం లభించింది. ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే.. వజ్రంలో మరో వజ్రం ఇమిడి ఉంది. ఇది ఆ వజ్రం లోపల అటూ ఇటూ కదులుతోంది.
Read Also: Atiq Ahmed : ఆమె శాపం వల్లే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చంపబడ్డాడా..?
0.329 క్యాటర్ల ఈ వజ్రానికి ‘‘ బీటింగ్ హార్ట్’’ అనే పేరు పెట్టారు. వజ్రాల గనుల్లో తవ్వకాల్లో గతేడాది అక్టోబర్ లో ఈ వజ్రం లభించింది. అత్యంత అరుదైన వజ్రం కావడంతో కేంద్రం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యమెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రోమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) దీనిపై మరింతగా అధ్యయనం చేసింది. ఆప్టిక్ల, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిగా బీటింగ్ హార్ట్ రకానికి చెందినదిగా తేల్చారు.
ఈ వజ్రంలో వజ్రం దాదాపుగా 80 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు తెలిపారు. దీని విలువ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఒకదానిలో ఒకటి ఇమిడిపోయే మత్రోష్కా అనే చెక్కబొమ్మల్ని రష్యాలో తయారు చేస్తారు, ఇప్పుడు అదే విధంగా మనదేశంలో వజ్రం లభించింది. ఈ వజ్రంలోపల మరో వజ్రం స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయంన చేసే ‘డి బీర్స్ గ్రూప్’ గ్రూప్ కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో ఇలాంటి వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.