Site icon NTV Telugu

Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. ఆటో నుంచి తోసేసి..

Rapido

Rapido

Rapido: బెంగళూర్‌లో దారుణం జరిగింది ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి యత్నించాడు. రాపిడో ఆటో డ్రైవర్ సదరు మహిళను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ స్నేహితుడు అంకుర్ బాగ్చి బుధవారం ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. తన స్నేహితురాలిని రాపిడో ఆటో డ్రైవర్ అనుచితంగా తాకడమే కాకుండా ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న వాహనం నునంచి బలవంతంగా బయటకు తోసేశాడని వెల్లడించారు. లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆయన ఆరోపించారు. సదరు సంస్థ సేవలు ఉపయోగించుకోవద్దని ఇతరులను కోరారు. ‘‘రాపిడో లైంగిక వేటగాళ్లను తీసుకుంటుందని, దాన్ని ఉపయోగించవద్దని, నా స్నేహితుల్లో ఒకరు గత రాత్రి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమెను అనుచితంగా తాకాడు. కదుతున్న ఆటో నుంచి నెట్టేశాడు’’ అని గురువారం నాడు రాశారు.

Read Also: Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..

అయితే ఈ కేసులో రాపిడోకు ఫిర్యాదు చేస్తే కేవలం క్షమాపనలు చెప్పింది, కానీ ఆటో రిక్షా డ్రైవర్ గురించి ఎలాంటి వివరాలు అందించలేదని అతను వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య సహాయం అవసరమని అంకర్ బాగ్చీ పోస్ట్ చేశారు. ఆయన పోస్టుపై బెంగళూర్ సిటీ పోలీసులతో సహా, నెటిజన్లు స్పందించారు. ‘‘ఈ ఘటన గురించి వివరాలను, ఆ ప్రాంతం వివరాలను, మీ కాంటాక్ట్ నెంబర్‌ని డీఎం ద్వారా వెల్లడించండి’’ అని పోలీసులు ట్వీట్ చేశారు. మరొక పోస్టులో డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై కస్టమర్‌తో చర్చించినట్లు, రాపిడో డ్రైవర్‌ని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తున్నట్లు రాపిడో కేర్స్ పోస్ట్ చేసింది. అతడిని రాపిడో నుంచి తొలగించామని వెల్లడించింది. మరోసారి రాపిడో క్షమాపనలు చెప్పింది.

Exit mobile version