Site icon NTV Telugu

Bengaluru Rapido: రాపిడో బైక్ బుక్ .. వచ్చిన వాహనం చూసి షాక్‌

Bengaluru Rapido

Bengaluru Rapido

Bengaluru Rapido: ప్రస్తుత ఉరుకుల ప్రయాణంలో .. వాహనాల రద్దీ నేపథ్యంలో సొంత వాహనాలను వాడుకోవడం కంటే ఓలా, ఉబర్‌, రాపిడో వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగిస్తే మనం వాహనం నడిపే టెన్షన్‌ లేకుండా ఉంటుందని.. అలాగే వాహనానికి వాడే పెట్రోల్‌ కంటే కొంచెం అటు ఇటుగా ట్యాక్సీకి ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్ వేర్‌ వారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలా రాపిడోలో ఒక సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి బైక్ బుక్ చేసుకున్నారు. తీరా వచ్చిన తరువాత వాహనాన్ని చూసి అతను షాకయ్యాడు. రాపిడో బైకర్‌ వచ్చింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రావడమే అతని ఆశ్చర్యానికి కారణం. రాపిడో బైకర్‌ ఏంటీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్ పై రావడమేంటని ఆశ్యర్యం తేరుకోలేకపోయాడు. ఇంతకీ ఏమీ జరిగిందంటే..

Read also: Viral News: ఇదేం లవ్ రా బాబు… 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!

కర్ణాటకలోని బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. నిశిత్ పటేల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వృత్తి రీత్యా బెంగళూరులో ఓ కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. మీటింగ్‌కు వెళ్లేందుకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. దీంతో నిమిషాల్లో అతనిముందు ఓ బైక్‌ వచ్చి ఆగింది. అయితే దానిని చూసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ షాకయ్యాడు. ఎందుకంటే రాపిడో బైకర్‌ వచ్చింది రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై. బైకుల్లోనే అత్యంత ఖరీదైన హంటర్ మోడల్‌‌ అది. బైక్‌ బుక్‌చేసుకున్నాక వెళ్లక తప్పదు కాబట్టి బైక్‌ ఎక్కి వెళుతున్నాడు. ఇదే విషయంపై బైకర్‌తో మాట్లాడితో మరో షాకింగ్‌ విషయం తెలిసింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి. విషయమేంటంటే ఆ రాపిడో బైకర్‌ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే అని. అది అక్కడితో ఆగలేదు. తాను ఏ పనిమీదైతే వెళ్తున్నాడో.. అదే పనిమీద, అక్కడికే అతడు కూడా వెళ్తున్నాడని తెలిసింది. దీంతో రైడర్‌ నిశిత్‌ మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇలా జీవితమంతా గుర్తుండేలా ఒకేసారి ఎదురైన మూడు అనుభవాలను అతను సోల్‌మీడియా వేదికైన ఎక్స్‌లో (ట్విట్టర్‌) పోస్టు చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నది. గంటల్లోనే 6 వేలకుపైగా మంది దానిని చూశారు. అంతే సంఖ్యలో కామెంట్లూ పెడుతున్నారు. ఈ సైడ్‌ బిజినెస్‌ ద్వారా ఎంత సంపాదిస్తున్నాడు కనుక్కోక పోయావా అంటూ ఓ వ్యక్తి నిశిత్‌ను ప్రశ్నించాడు.. అరే.. ఈ ఆలోచన అప్పుడు రాలేదు.. దీనిగురించి తెలుసుకోవాల్సి ఉండే అంటూ రిప్లే ఇచ్చాడు. అహ్మదాబాద్‌లో ఐదేండ్ల నుంచే ఓలా, ఊబర్‌, రాపిడో రైడర్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హార్లీ డేవిడ్సన్‌పై కూడా తిరుగుతున్నారు అంటూ మరో నెటిజన్‌ దానిపై కామెంట్‌ చేశాడు.

Exit mobile version