Bengaluru Rapido: రాపిడో బైక్ బుక్ .. వచ్చిన వాహనం చూసి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Rapido: ప్రస్తుత ఉరుకుల ప్రయాణంలో .. వాహనాల రద్దీ నేపథ్యంలో సొంత వాహనాలను వాడుకోవడం కంటే ఓలా, ఉబర్, రాపిడో వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగిస్తే మనం వాహనం నడిపే టెన్షన్ లేకుండా ఉంటుందని.. అలాగే వాహనానికి వాడే పెట్రోల్ కంటే కొంచెం అటు ఇటుగా ట్యాక్సీకి ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్ వేర్ వారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలా రాపిడోలో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి బైక్ బుక్ చేసుకున్నారు. తీరా వచ్చిన తరువాత వాహనాన్ని చూసి అతను షాకయ్యాడు. రాపిడో బైకర్ వచ్చింది రాయల్ ఎన్‌ఫీల్డ్ రావడమే అతని ఆశ్చర్యానికి కారణం. రాపిడో బైకర్ ఏంటీ రాయల్ ఎన్‌ఫీల్డ్ పై రావడమేంటని ఆశ్యర్యం తేరుకోలేకపోయాడు. ఇంతకీ ఏమీ జరిగిందంటే..
Read also: Viral News: ఇదేం లవ్ రా బాబు… 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!
Also Read
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
కర్ణాటకలోని బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. నిశిత్ పటేల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వృత్తి రీత్యా బెంగళూరులో ఓ కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. మీటింగ్‌కు వెళ్లేందుకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. దీంతో నిమిషాల్లో అతనిముందు ఓ బైక్ వచ్చి ఆగింది. అయితే దానిని చూసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షాకయ్యాడు. ఎందుకంటే రాపిడో బైకర్ వచ్చింది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై. బైకుల్లోనే అత్యంత ఖరీదైన హంటర్ మోడల్ అది. బైక్ బుక్‌చేసుకున్నాక వెళ్లక తప్పదు కాబట్టి బైక్ ఎక్కి వెళుతున్నాడు. ఇదే విషయంపై బైకర్‌తో మాట్లాడితో మరో షాకింగ్ విషయం తెలిసింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి. విషయమేంటంటే ఆ రాపిడో బైకర్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే అని. అది అక్కడితో ఆగలేదు. తాను ఏ పనిమీదైతే వెళ్తున్నాడో.. అదే పనిమీద, అక్కడికే అతడు కూడా వెళ్తున్నాడని తెలిసింది. దీంతో రైడర్ నిశిత్ మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇలా జీవితమంతా గుర్తుండేలా ఒకేసారి ఎదురైన మూడు అనుభవాలను అతను సోల్‌మీడియా వేదికైన ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్టు చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నది. గంటల్లోనే 6 వేలకుపైగా మంది దానిని చూశారు. అంతే సంఖ్యలో కామెంట్లూ పెడుతున్నారు. ఈ సైడ్ బిజినెస్ ద్వారా ఎంత సంపాదిస్తున్నాడు కనుక్కోక పోయావా అంటూ ఓ వ్యక్తి నిశిత్‌ను ప్రశ్నించాడు.. అరే.. ఈ ఆలోచన అప్పుడు రాలేదు.. దీనిగురించి తెలుసుకోవాల్సి ఉండే అంటూ రిప్లే ఇచ్చాడు. అహ్మదాబాద్‌లో ఐదేండ్ల నుంచే ఓలా, ఊబర్, రాపిడో రైడర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్, హార్లీ డేవిడ్సన్‌పై కూడా తిరుగుతున్నారు అంటూ మరో నెటిజన్ దానిపై కామెంట్ చేశాడు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!