Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ఆశీర్వాదంగా భావిస్తున్నానన్న ప్రధాని మోడీ..

Ram Mandir

Ram Mandir

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. హిందువులంతా ఎంతో అపురూపంగా భావిస్తున్న ఈ రామ మందిర ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరగనుంది. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు ప్రధాని నివాసానికి వచ్చారు.

Read Also: Amitshah-Pawan Kalyan: అమిత్‌ షాతో పవన్‌ భేటీ.. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ

దీనిపై ఎక్స్(ట్విట్టర్)లో ప్రధాని మోడీ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘‘ఈ రోజు భావోద్వేగాలతో నిండి ఉంది. ఇటీవల శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర శంకుస్థాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు’’ అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ నేను చాలా ఆశీర్వాదంగా భావిస్తున్నాను.నా జీవితంలో ఈ చారిత్రాత్మక సందర్భానికి నేను సాక్ష్యంగా నిలవడం నా అదృష్టం’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.

జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధాని మోడీ వెల్లడించారు. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ జనవరి 22 న ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ధృవీకరించారు. వారి ఆహ్వానాన్ని పీఎం మోడీ అంగీకరించారు.

Exit mobile version