NTV Telugu Site icon

Ayodhya Ram Mandir: 2500 ఏళ్లలో ఒకసారి వచ్చే భారీ భూకంపాన్ని రామ మందిరం తట్టుకుంటుంది..

Ram Mandir 2

Ram Mandir 2

Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా పండగ రీతిలో అయోధ్య రామమందిరం ఈ నెల 22 ప్రారంభమైంది. అయితే, అద్భుత రీతిలో నిర్మించిన ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని తట్టుకునేలా రూపొందించారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్‌కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్‌తో సహా అనేక శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించింది.

Read Also: Ram Mandir: వారం రోజుల్లో అయోధ్య రాముడిని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు..

గరిష్టంగా వచ్చే భూకంపాలను తట్టుకునేలా ఆలయ నిర్మాణ భద్రతను నిర్ధారించడానికి శాస్త్రీయ అధ్యయనం జరిగింది. ఇది 2500 ఏళ్లలో వచ్చే శక్తివంతమైన భూకంపాన్ని తట్టుకుంటుందని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త దేబ్‌దత్తా ఘోష్ చెప్పారు. 50 కంటే ఎక్కువ కంప్యూటర్ మోడళ్లను సిమ్యులేట్ చేసిన తర్వాత మరియు దాని సరైన పనితీరు, నిర్మాణ ఆకర్షణ మరియు భద్రత కోసం వివిధ లోడింగ్ పరిస్థితులలో ఉన్న వాటిని విశ్లేషించిన తర్వాత స్ట్రక్చరల్ డిజైన్‌ను సిఫార్సు చేసినట్లు ఘోష్ చెప్పారు.

రామాలయ నిర్మాణానికి ఇనుము, ఉక్కును ఉపయోగించలేదు. వీటి కాల పరిమితి 90 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది, అందుకనే నిర్మాణంలో వీటిని ఉపయోగించలేదు. సరయు నదీ తీరంలో నిర్మాణం ఉండటంతో భూమిలో తేమ పరిస్థితులను తట్టుకునేందుకు అత్యంత బలంగా రాయి నిర్మాణాన్ని తలపించే విధంగా పునాదిని ఏర్పాటు చేశారు. పూర్తిగా రాతితో, ఇంటర్ లాక్ టెక్నాలజీతో రామ మందిర నిర్మాణం జరిగింది.