Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా 7000 మంది ముఖ్య అతిథులతో పాటు సాధువులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మరోవైపు కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా వీక్షించనున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, విరాట్ కోహ్లీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
Read Also: Alcohol: ఆల్కాహాల్ మానేస్తేనే మంచి నిద్ర.. కీలక అధ్యయనంలో వెల్లడి..
ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిరం వేడకలు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోని అన్ని భారత రాయబార కార్యాలయాల్లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ప్రసారం కానుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ భారత్ మరియు విదేశాల్లోని రామభక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు బీజేపీ పార్టీ బూత్ లెవల్‌లో రామాలయ ప్రారంభోత్సవాన్ని స్క్రీనింగ్ చేయడానికి సిద్ధమైంది. భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది. ఆ రోజు ప్రజలకు అన్నదానాలు నిర్వహించనుంది. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్లోని అన్ని జైళ్లలో ఈ కార్యక్రమాన్ని ఖైదీలకు చూపించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. జనవరి 16 నుంచే అయోధ్యలో వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.