NTV Telugu Site icon

Ram Mandir: రామమందిర ఆహ్వానపత్రిక ప్రత్యేకతలు ఇవే.. 7000 మందికి అతిథులకు ఆహ్వానం

Ram Mandir

Ram Mandir

Ram Mandir: అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవనానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 22న శ్రీరామమందిర ప్రతిష్టాపన జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపబడుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికలను కూడా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ప్రతీ ఆహ్వన పత్రికపై శ్రీరాముడి చిత్రంతో పాటు రామమందిర ఉద్యమానికి సంబంధించి ముఖ్య సంఘటనలకు సంబంధించిన వివరాలతో కూడిన బుక్ లెట్ ఉంది. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారి వివరాలు ఉన్నాయి.

ప్రధాన ఆహ్వాన పత్రికపై రామ మందిర చిత్రం ఉంది. ఇన్విటేషన్ కార్డ్ దిగువన ‘శ్రీరామ్ ధామ్’ దానికింద అయోధ్య అని ముద్రించబడి ఉంది. విల్లు, బాణాలు ధరించిన బాల రాముడి చిత్రాలు ఆహ్వాన పత్రికలో ఉన్నాయి. జనవరి 22వ తేదీ ఉదయం 11:30 గంటలకు ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ పూజ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కార్యక్రమానికి సంబంధించిన ప్రముఖ అతిథులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని అందులో పేర్కొన్నారు. ఆహ్వానం ప్రకారం.. అతిథులు బయలుదేరిన తర్వాత సాధువులు రామ్ లల్లా విగ్రహాన్ని దర్శించుకోవడం ప్రారంభిస్తారు.

Read Also: Islamic State: ఇరాన్ జంట బాంబుదాడులు మా పనే..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహ్వాన పత్రిక పేర్కొంది. రాముడు తన సొంత గొప్ప దేవాలయ స్థానానికి వస్తున్నాడని పత్రిక పేర్కొంది.

1528 నుండి 1984 వరకు రామ మందిరం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా 76 పోరాటాలలో పాల్గొన్న వారికి ఆహ్వాన పత్రికలోని బుక్‌లెట్ అంకితం చేయబడింది. ఈ పోరాటం నుండి ప్రేరణ పొంది, 77వ పోరాటం అక్టోబర్ 1984లో సరయు నది ఒడ్డున ప్రారంభమైందని కూడా ప్రస్తావించబడింది. ఆహ్వానితుల్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, బిలియనీర్స్ ముఖేస్ అంబానీ, గౌతమ్ అదానీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 4000 మంది సాధువులను ఆహ్వానించారు. రామాలయ ఉద్యమంలో మరణించిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యును కూడా ఆహ్వానించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

Show comments