Ram Gopal Varma: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
- కన్నడ స్టార్‌ని ఉద్దేశించి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
- దర్శన్ వ్యవహారంపై ట్వీట్..
- ఒక అభిమానిని ఉపయోగించుకుని మరో అభిమాని హత్య..
- దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దర్శన్ వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: కన్నడ స్టార్ హీరో దర్శన్, తన వీరాభిమానిని అత్యంత దారుణంగా హత్య చేయించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.33 ఏళ్ల రేణుకా స్వామి అనే వ్యక్తిని తన తన అభిమానులు, బౌన్సర్లతో దాడి చేయించడంతో అతను మరణించాడు. భార్య ఉన్నప్పటికీ, నటి పవిత్ర గౌడతో దర్శన్ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన అభిమాన నటుడు దర్శన్ సంసారాన్ని పవిత్ర గౌడ దెబ్బతీసిందనే కోపంతో రేణుకా స్వామి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడంతోనే ఈ హత్య చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పవిత్ర గౌడతో పాటు దర్శన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: lucky Bhaskar : దుల్కర్ “లక్కీ భాస్కర్” మ్యూజికల్ ప్రమోషన్స్ పై స్పెషల్ అప్డేట్..
Also Read
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
ఇదిలా ఉంటే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శన్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఒక స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్న డై హార్డ్ అభిమానిని చంపడానికి మరో డై హార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించడం స్టార్ ఆరాధన సిండ్రోమ్‌కి ఒక ఉదాహరణ’’ అని ట్వీట్ చేశారు. ‘‘అభిమానులు తమ అభిమాన స్టార్స్ తమ జీవితాలను ఎలా నడపాలి అని ఆర్డర్ చేయాలనునకోవడం ఈ సిండ్రోమ్ యొక్క అనివార్యమైన దుష్ప్రభావం’’ అని అన్నారు. అయితే ఆర్జీవీ ఎవరి పేరును డైరెక్ట్‌గా పేర్కొనలేదు.
33 ఏళ్ల రేణుకా స్వామి దర్శన్‌కి వీరాభిమాని. అయితే, తన అభిమాన హీరో, పవిత్ర గౌడతో సహజీవనం చేస్తుండటంపై తరుచూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతోనే అతడిని చిత్రదుర్గ నుంచి బెంగళూర్ రప్పించి దాడి చేసినట్లు తెలుస్తోంది. రేణుకా స్వామి హత్యకు కారణమైన నలుగురిలో ఇద్దరికి దర్శన్ ఒక్కొక్కరికి రూ. 5 చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తాజా పరిణామం ప్రకారం, దర్శన్ సన్నిహితుడు నాగరాజ్ మరియు సహ నటుడు ప్రదోష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దర్శన్ వ్యవహారాలన్నీ నాగరాజ్ చూసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మైసూరులోని నటుడి ఫామ్‌హౌస్‌ను కూడా అతను చూసుకున్నాడు. బాధితుడిని బెల్ట్, కర్రలతో దాడి చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
A star using one die hard fan to kill another die hard fan who was interfering in his personal life is a fit example of the bizarreness of the star worship syndrome ..Fans wanting to order how their stars should run their lives is a unavoidable side effect of the same syndrome
— Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2024
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..