ఉత్తరప్రదేశ్ లో జరిగిన లఖింపూర్ ఘటన దేశవ్యాపితంగా పెను దుమారమే లేపింది… యోగి సర్కార్ నుంచి మోడీ సర్కార్ వరకు.. అందరిపై విమర్శలు, ఆరోపణలు పెరిగి పోయాయి.. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప.. విచారణ ముందుకు సగలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.. అయితే ఈ కేసులో దర్యాప్తు పట్ల భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేయాలి. ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రైతులను ఆయన హెచ్చరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. లఖింపూర్ ఘటన వెనుక ఆయన ఉన్నారు అని ఆరోపించారు టికాయత్.. ఇక కేంద్ర మంత్రి రాజీనామా, అరెస్ట్ కు ఒత్తిడి తీసుకురావడం కోసమే రైల్‌రోకో జరుపుతున్నామని, మంత్రిని ఆ పదవి నుంచి తప్పించనంత వరకూ నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదన్నారు.
మరోవైపు.. రైతులపై కార్లు నడిపి వారి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు రెడ్ కార్పొట్ అరెస్టు చేయడం రైతుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతోందని అన్నారు టికాయత్.. సిట్ దర్యాప్తును మంత్రి ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.