బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలకు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర మంత్రులను ఇంచార్జులుగా నియమించింది. రాజస్తాన్ కు ఎన్నికల ఇంచార్జ్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను, హర్యానాకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కర్ణాటకకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కర్ణాటకకు ఇంచార్జులుగా నియమించారు.
జూన్ 10 ఈ నాలుగు రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 22 మంది అభ్యర్థులను నిలబెట్టింది. లోక్ సభలో క్లియర్ మెజారిటీ ఉన్నా..రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేదు. దీంతో కీలక బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికలను బీజేపీ కీలకంగా తీసుకుంది.
బీహార్, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్ర నుంచి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ తో సహా ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇక్కడ మూడో స్థానాన్ని కూడా గెలుచుకోవాలని భావిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి మధ్య భిన్నాభిప్రాయాల్లో ఇక్కడ కూడా మూడో సీటు గెలుచుకోవడానికి ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపింది.
రాజస్థాన్, హర్యానా నుంచి నలుగురు అభ్యర్థులను నిలబెట్టింది. జీగ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రను రాజస్తాన్ నుంచి బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఐటీవీ ఎండీ కార్తికేయ శర్మను హర్యానా నుంచి పోటీలో నిలబెట్టింది బీజేపీ