Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం
  • బెంగాల్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర ఎంపీలు ప్రమాణం
Rajya Sabha

Rajya Sabha

రాజ్యసభలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఎన్నికైన ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌సీపీ-ఎస్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్రమంత్రి రాందాస్ అథేవాల్, డీఎంకే నేత తిరుచ్చి శివ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

×
×
Ad

గత నెల ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. దీంతో పలువురు రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికయ్యారు. బీహార్‌లో అనూహ్యంగా నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన వారసుడిగా బీజేపీ వ్యక్తి రానున్నారు. అయితే ఆ వారసుడి ఎవరన్నది హైకమాండ్ తేల్చలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎంపిక జరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేసులో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.