Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్
- ముంచుకొస్తోన్న ట్రంప్ డెడ్‌లైన్
- నరకం చూపిస్తామని హెచ్చరిక
- ట్రంప్ బెదిరింపులను తిప్పికొట్టిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. దాడులు.. ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇక 48 గంటల్లో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌కు నరకం చూపిస్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ డెడ్‌లైన్ గడువు దగ్గర పడుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భీకర దాడులు ఉండొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
‘‘మంగళవారం ఇరాన్‌లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకే రోజు జరగనున్నాయి. అలాంటిది మరెక్కడా జరగదు!!! ఆ జలసంధిని తెరవండిరా పిచ్చి వెధవల్లారా.. లేకపోతే నరకంలో బ్రతుకుతారు.. చూస్తూ ఉండండి! అల్లాకే సర్వ స్తోత్రాలు.’’ అని ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో హెచ్చరిస్తూ రాసుకొచ్చారు.
Also Read
అంతేకాకుండా ట్రంప్ పలు అమెరికన్ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్‌లు ఇచ్చారు. రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే.. ‘‘మనం ఆ దేశం మొత్తాన్ని పేల్చేస్తాం.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మంచి అవకాశం ఉంది. కానీ వాళ్లు ఒప్పందం చేసుకోకపోతే నేను అక్కడ అంతా నాశనం చేస్తాను.’’ అని ఆక్సియోస్, ఫాక్స్ న్యూస్‌తో పేర్కొన్నారు.
ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తానని ట్రంప్ బెదిరించారు. ‘‘ప్రతిరోజూ వారు మరిన్ని వంతెనలు, మరిన్ని విద్యుత్ కేంద్రాలు, ఇంకా ఇతరత్రా అన్నీ నిర్మించాల్సి ఉంటుంది.’’ అని ఏబీసీ న్యూస్‌తో ట్రంప్ అన్నారు . ‘‘ఇంతటి దెబ్బను ఏ దేశమూ ఎన్నడూ అనుభవించలేదు.’’ అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ
ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందానికి గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి తెరవడానికి బదులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. 45 రోజులు కాల్పుల విరమణకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు చర్చలు సఫలీకృతం కాలేనట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా వాషింగ్టన్, టెహ్రాన్, పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీల మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లభించలేదు.
ఇరాన్ హెచ్చరిక
అయితే ట్రంప్ బెదిరింపులను ఇరాన్ తిప్పికొట్టింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని మౌలిక సదుపాయాలపై తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరించింది. ట్రంప్ డెడ్‌లైన్‌కు ప్రతిస్పందనగా… ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఎదురుదాడి చేస్తూ.. ‘‘మీ దుందుడుకు చర్యలు అమెరికాలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని నరకంలోకి నెడుతున్నాయి.’’ అని అన్నారు. అంతేకాకుండా ట్రంప్ ‘‘నెతన్యాహు ఆదేశాలను పాటిస్తున్నారని’’ ఆరోపించారు. ‘‘ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించాలని.. ఈ ప్రమాదకరమైన ఆటను అంతం చేయాలని’’ ఘాలిబాఫ్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!